పవన్ కూడా కెసిఆర్ అంతటోడు…ఎనీ డౌట్ ?

Pawan Kalyan Follows KCR Strategies in Politics
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మా మీద ఎవరికీ అపనమ్మకం లేదు. అయితే ఆయన రాజకీయ చాతుర్యం మీద మాత్రం ఎన్నో సందేహాలు. జనసేన ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా పవన్ రాజకీయ ప్రయాణం పరిశీలిస్తే ఆ డౌట్ రావడంలో తప్పు లేదు. కానీ తాజా పరిణామాలు గమనిస్తే, పవన్ స్కెచ్ చూస్తే కెసిఆర్ అంతటోడు అని ఒప్పుకోవాల్సిందే. అదెలాగో చూద్దామా…తెరాస రాజకీయ ప్రయాణానికి 2009 ఎన్నికలు పెద్ద స్పీడ్ బ్రేకర్. ఆ సమయంలో దారులు మొత్తం మూసుకుపోతున్నాయి అనుకున్నప్పుడు ఆయనకు తెలంగాణ ఉద్యమాన్ని అస్త్రంగా మలచడంలో కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడ్డ జాక్ ఉపయోగపడింది. జాక్ ముందుకు రాగానే తెరాస రాజకీయ తప్పిదాలను పెద్దగా ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. పైగా జాక్ బలం నేరుగా తెరాస కి ట్రాన్స్ఫర్ అయినట్టు 2014 ఎన్నికల్లో తెలిసింది. ఇప్పుడు అదే స్కెచ్ ని ఫాలో అయిపోతున్నాడు పవన్ .

విభజన హామీలు నెరవేర్చని కేంద్రం మీద కత్తులు నూరుతున్న ఆంధ్రులు రాజకీయంగా కూడా ఏ పార్టీని నమ్మలేని సందిగ్ధంలో పడ్డారు. అందుకు జనసేన కూడా అతీతం కాదు. ఈ పరిస్థితుల్లో రాజకీయ ప్రయాణం అంత తేలిక కాదు . అందుకే సమయం చూసి జేపీ, ఉండవల్లి లాంటి వాళ్ళను ముందు పెట్టి ప్రత్యేక హోదా , విభజన సమస్యల మీద ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ కమిటీ నిబద్ధత , అర్హత , అనుభవం వంటి అంశాలు ముందుకు వస్తే జేపీ, ఉండవల్లి మొహాలు కనిపిస్తాయి. కానీ ఆ ఇద్దరినీ ఒక గొడుగు కిందకి తెచ్చిన ఘనత పవన్ కి చెందుతుంది. ఈ కమిటీ ఎంత బలపడితే జనసేన కూడా అంత బలపడ్డట్టే . పైగా ఈ కమిటీ రూపంలో టీడీపీ , వైసీపీ లకు ప్రత్యామ్న్యాయంగా ఓ రాజకీయ కూటమికి అంకురార్పణ జరిగినట్టే. ఆ కూటమిలో జనసేన , లోక్ సత్తా , సిపిఐ చేరిపోయినట్టే. సైలెంట్ గా పవన్ వేసిన ఈ స్కెచ్ గమనిస్తే ఆయన కెసిఆర్ అంతటోడు అని ఒప్పుకోక తప్పదు.