జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాల గందరగోళానికి గురి కావాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అమరావతి ని రాజధానిగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన టీడీపీ, జనసేన పార్టీ లను ఇరకాటంలోకి నెట్టివేసింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతికి కాదు, మూడు రాజధానులకి కూడా కాకుండా, ప్రజా నిర్ణయాలు తెలుసుకొని అపుడు వివరించాల్సిందిగా నేతలకు సూచించడం జరిగింది. అయితే పవన్ అమరావతి పర్యటన లో రైతుల ఆందోళనకి మద్దతు తెలిపారు. మంగళగిరి లోకి నవులూరు లో రైతుల దీక్షకు పవన్ సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత ఎర్రబాలెం కి చేరుకున్నారు, అక్కడ మహిళా రైతులతో ముచ్చటించిన పవన్ వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు.