జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలపనున్నారు. రేపు అమరావతి ప్రాంతాలైన మందడం, వెలగపూడి తుళ్లూరు ప్రాంతాల్లో పర్యటించి, వారి తో మాట్లాడనున్నారు. ఇప్పటికే జనసేన నాయకుడు నాగబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించి 20 పేజీ ల నివేదికని పవన్ కళ్యాణ్ కి అందించడం జరిగింది. ఆ నివేదిక ఫై జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించారు.
అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ కి కానీ, అటు వైసీపీ కి కానీ అనుకూలంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అమరావతి రాజధాని రైతుల్ని పరామర్శించనున్నారు. కానీ జనసేన పార్క్ లక్ష్యం అందరికి న్యాయం చేయడమే. అందుకే జిల్లాల వారీగా అందరి అభిప్రాయాలు సేకరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించడం జరిగింది.