ప్రముఖ సినీ హీరో మరియు రాజకీయ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ జీవితంలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అలాగే పవన్ యొక్క వైవాహిక జీవితం కూడా తెలుగు ప్రజలకు తెరచిన పుస్తకమే.అయితే పవన్ తన కొత్త సంవత్సరాన్ని చేసుకోకపోయినా సరే పవన్ అభిమానులు ఆనందంతో చిరు నవ్వు నవ్వే గిఫ్ట్ ను ఆయన మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ ఇచ్చారు.వీరిరువురూ విడిపోయినా సరే ఒకరికొకరు సాన్నిహిత్యంగా ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే.
అలాగే వారి పిల్లలు కూడా పవన్ తో గడిపిన ఎన్నో ఫోటోలు మనం ఇటీవలే కాలంలో చూసాము.అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రేణు దేశాయ్ ఒక పోస్ట్ చేసారు.”పిల్లలు చాలా అద్భుతంగా ఉంటారని అలాగే తమ తల్లిదండ్రుల నుంచి వారి పోలికలతో అందంగా ఉంటారని పవన్ తో వారి కుమార్తె అయినటువంటి ఆద్య కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసారు.అంతే కాకుండా ఆద్యను ఎక్కువ సార్లు చూసినప్పుడు నాలాగే ఉన్నట్టు ఉంటుంది అని కానీ కొన్ని సార్లు తన నానమ్మ, నాన్నలకు ఒక కాపీలా కనిపిస్తుంది అని ఆఖరుగా ఆద్య తన కెమెరాకు ఫెవరెట్ పర్సన్ అని కొత్త సంవత్సరం మొదటి రోజున పవన్ అభిమానులకు మంచి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.