పవన్ పేరిట మొబైల్ యాప్.. విశాఖ కుర్రాడి సృష్టి

pk-15

Posted [relativedate]

pawan messenger android app vizag student discoveredవిశాఖకు చెందిన ఆదుర్తి సూర్యచంద్ర పవన్‌ అనే టెన్త్ చదివే కుర్రాడు వాట్సప్ లాంటి మొబైల్ యాప్‌ను రూపొందించాడు. ఇందుకు పవన్ మెసెంజర్ అని పేరు కూడా పెట్టాడు.

ఈ మెసెంజర్ యాప్‌లో గ్రూప్ చాటింగ్, ఛానల్ క్రియేషన్, కాలింగ్ సదుపాయం, చాట్ బ్యాక్ గ్రౌండ్ ఛేంజ్, వీడియో కంప్రస్ వంటి ఫీచర్లు ఉంటాయి. సామాన్యులకు సైతం ఈ యాప్ సులువుగా అర్థమవుతుందని, టెలిగ్రామ్ ఆర్గనైజేషన్ అంతర్జాలంలో ఉంచిన నెట్ సర్వీసుతో ఈ ‘పవన్ మెసెంజర్’పని చేస్తుందని పవన్ చెబుతున్నాడు.   ఈ’పవన్ మెసెంజర్’ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు అవసరమైన అన్ని వివరాలతో రిజిస్టర్ చేసుకుని ప్లేస్టోర్‌ లోకి అప్‌లోడ్ చేశానని వివరించాడు.