దసరాకు అబ్బాయిని తీసుకు రాబోతున్న బాబాయి!

pawan-to-launch-rangasthala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇంకా రివీల్‌ చేయలేదు. టైటిల్‌ లోగో మాత్రమే ఆవిష్కరించిన చిత్ర యూనిట్‌ సభ్యులు దసరా కానుకగా చరణ్ లుక్‌ను రివీల్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే చరణ్‌ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అనే విషయంపై అభిమానులకు మరియు ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. ఇక దసరాకు అధికారికంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి సినిమా స్థాయిని పెంచాలని, సినిమాపై అంచనాలను అమాంతం పెంచాలని దర్శకుడు సుకుమార్‌ భావిస్తున్నాడు.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘రంగస్థలం’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను పెద్ద ఈవెంట్‌ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ ఈవెంట్‌కు పవన్‌ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్‌ చేతుల మీదుగా రంగస్థం ఫస్ట్‌లుక్‌ను తీసుకు వచ్చి, తద్వారా సినిమాపై అంచనాలను పెంచాలని చిత్ర యూనిట్‌ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్నా కూడా అబ్బాయి చరణ్‌ సినిమా కోసం కొన్ని గంటలు కేటాయించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దసరాకు పవన్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ కూడా వచ్చే అవకాశాలున్నాయి.