2019 ఎన్నికల ఫలితాన్ని బట్టి పవన్‌ 26వ చిత్రం… 

Pawan's 26th film on the results of the 2019 election

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ముగించే ఆలోచనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. పవన్‌ అజ్ఞాతవాసి చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఆయన తర్వాత సినిమాపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. అజ్ఞాతవాసి చిత్రం సక్సెస్‌ అయ్యి ఉంటే వెంటనే పవన్‌ మరో సినిమాను మొదలు పెట్టేవాడు. ఇప్పటికే పవన్‌ రెండు సినిమాలకు కమిట్‌ అయ్యి అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నాడు. కాని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసిన సినిమానే ఫ్లాప్‌ అవ్వడంతో ఇక చిన్న దర్శకులతో చేసిన సినిమాలు ఏం ఆడుతాయి అనే ఉద్దేశ్యంతో పవన్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చాడు.

తాజాగా తెలంగాణలో ప్రజా యాత్ర నిర్వహిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ తాను ఇకపై పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి సినిమాలు పక్కన పెట్టేస్తున్నాను అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. పవన్‌ 2019 ఎన్నికలు టార్గెట్‌గా జనసేన పార్టీని ముందుకు నడిపించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇలాంటి సమయంలో సినిమాల్లో నటిస్తే రెంటికి న్యాయం చేయలేను అనే ఉద్దేశ్యంతో పవన్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు.

2019 ఎన్నికల్లో పవన్‌ ఎక్కువ స్థానాలు సాధిస్తే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అలా జరిగితే పవన్‌ సినిమాలకు పూర్తిగా దూరం కానున్నాడు. ఒక వేళ 2019 ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోతే అప్పుడు మళ్లీ పవన్‌ సినిమాలు చేస్తాడు. మొత్తానికి పవన్‌ సినీ కెరీర్‌ 2019 ఎన్నికల్లో ప్రజలు వేసే ఓట్లను బట్టి నిర్ణయించబడుతుంది.