రిథమ్(కీర్తి సురేష్), రఘు(లింగ)ల ఒక్కగానొక్క కొడుకు అజయ్. అజయ్ అంటే రిథమ్‌కు పంచప్రాణాలు. ఓ రోజు అజయ్ కిడ్నాప్ అవుతాడు. దీంతో అతడి కోసం తల్లిదండ్రులిద్దరూ అడవిలో అంగుళం అంగుళం జల్లెడ పట్టినప్పటికీ అజయ్ జాడ దొరకదు. పైగా ట్రైలర్లో చూపినట్లు అజయ్ దుస్తులు కనిపించగానే అతడు చనిపోయాడని అందరూ భావిస్తారు.. రిథమ్ తప్ప ఇదే సమయంలో అజయ్ కోసం మానసికంగా కుంగిపోతున్న రిథమ్ నుంచి రఘు విడాకులు తీసుకుంటాడు. అయిన్పటికీ ఆమె తన అన్వేషణ మానదు.
ఈ క్రమంలో ఆమె గౌతమ్(రంగరాజ్)ను వివాహం చేసుకుని గర్భం దాల్చుతుంది. అయితే ఓరోజు సడన్‌గా రిథమ్‌కు అజయ్ కనిపిస్తాడు. ఇన్నిరోజులు అజయ్ ఏమైపోయాడు? అతనితోపాటు అపహరణకు గురైన ఆరుగురు పిల్లలు బతికే ఉన్నారా అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారు చార్లీ చాప్లిన్ ముసుగు ధరించిన సీరియల్ కిల్లర్ ఎవరు గర్భంతో ఉన్న కీర్తి అతడిని ఎలా ఎదుర్కొంది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రారంభ సన్నివేశంలోనే దర్శకుడు కథను ముందుగా పరిచయం చేస్తాడు. దీంతో ప్రేక్షకుడు స్టోరీ లైన్ అర్థమై కథలో లీనమయ్యేందుకు సిద్ధపడతాడు. తల్లి ప్రేమ కథతో సినిమాను ఎమోషనల్‌గా నడిపిస్తూనే సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ప్రథమార్థంలో పట్టును చూపించినప్పటికీ.. ద్వితీయార్థంలో మాత్రం అక్కడక్కడా తేలిపోయాడు. ఎక్కువగా దర్శకుడు రిథమ్(కీర్తి)ని హైలెట్ చేయడానికే ప్రయత్నించాడని కొట్టొచినట్లు కనిపిస్తుంది. సినిమా ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే బాగుండనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
కథ చివర్లో వచ్చే ట్విస్ట్ చూసి ప్రేక్షకులు పెదవి విరవడం ఖాయం. పైగా మొదటి నుంచి సీరియల్ కిల్లర్‌ను భయంకరంగా చూపిస్తూ చివర్లో మాత్రం కీర్తి కోసం అతడి బలాన్ని తక్కువ చేసినట్లు అనిపిస్తుంది. అజయ్‌ను ఎత్తుకుపోవడానికి గల కారణం కూడా సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఈ అంశాలను పక్కపెడితే థ్రిల్లర్ చిత్రాలిష్టపడేవారు తప్పకుండా ఓ సారి “పెంగ్విన్”ను చూసేయొచ్చు.