జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు

జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం అమరావతిలో నిరసన సెగలకు కారణం అవుతుంది. అయితే ఈ నిర్ణయం పట్ల సొంత పార్టీ కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమరావతి వెలగపూడిలో పంచాయతీ కార్యాలయానికి వైసీపీ కార్యకర్తలు నల్ల రంగు వేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నప్పటికీ వైసీపీ రంగుల ఫై నల్ల రంగులు వేసి నిరసన తెలిపారు. అయితే వీరి నిరసన కు ప్రజలు, రైతులు కూడా మద్దతు తెలుపడం జరిగింది.

అయితే తమని పట్టించుకోని పార్టీకి ఆ రంగులు కార్యాలయానికి ఎందుకని ప్రశ్నించారు. అయితే జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని గ్రామాల్లో రోడ్లకి అడ్డంగా పలు వాహనాల్ని పెట్టి రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. కొందరు వెరైటీ గా దున్నపోతుకు పాలు పితుకుతూ నిరసనని తెలియజేసారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది.