ఏపీలో దేశంలోనే మొట్టమొదటి సారిగా దిశ చట్టాన్ని తీసుకొచ్చామని, దిశా పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభించామని వైసీపీ తప్పుడు ప్రచారం చేసుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అసెంబ్లీలో మద్యం అంశంపై మాట్లాడినందుకు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారని ఈ విషయాన్ని రెండు నెలల ముందే స్పీకర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట.
అయితే తాజాగా ఎమెల్యే శ్రీదేవి ఈ విషయంపై దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే ఇంకా దిశ చట్టం అమలులోకి రాలేదని పోలీసులు చెబుతున్నారట. అయితే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభాల పేరుతో సీఎం అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని ఇంకా దిశ చట్టం అమలులోకి రాలేదని పోలీసులు అసలు దిశ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం లేదని అలాంటప్పుడు దిశ పోలీస్ స్టేషన్లు అంటూ ఎందుకు జగన్ గారు ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడుతున్నారు.