కరోనా పై తిరుపతి ప్రజల నిర్లక్ష్యం

కరోనా పై తిరుపతి ప్రజల నిర్లక్ష్యం

తిరుపతిలో జనతా కర్ఫ్యూను పరిశీలిస్తే  అత్యంత దారుణం అయిన చిత్రం ఆవిష్కృతం అయ్యింది.ఉదయం 9 గo ల కల్లా విధుల్లో కనీసం 40 వేల మంది మన ఆరోగ్య భద్రత పట్ల ఏ మాత్రం జాగురూకత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్ల మీదికి రావడం జరిగింది.

‘భారతీయులకు రోగ నిరోధక శక్తి చాలా అధికం, కరోనా వైరస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో బతకాదు….’ ఇలాంటి శాస్త్రీయంగా రుజువు కాని విషయాలను నమ్మకండి. అధికారిక సమాచారం ప్రకారం *” మన తిరుపతిలో 500 పైగా విదేశాల నుండి వచ్చిన వారు గృహ నిర్బంధం లో వున్నారు”* ఈ రోజు మాత్రమే దాదాపుగా 200 మందిని గృహ నిర్బంధం లో ఉంచారు.

మన అదృష్టం కొద్ది వీరందరికీ ప్రస్తుతానికి వైద్య పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చింది కానీ కరోనా వైరస్ వలన వచ్చే వ్యాధి లక్షణాలు బయట పడటానికి 14 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ ఈ 500 మందిలో ఏ ఒక్కరికి ఈ 14 రోజుల్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చినా ఇప్పటివరకు ఆ ఒక్కడు కలసిన ప్రతి ఒక్కరికీ కరోనా సంక్రమించే అవకాశం వుంది. ఆలా వైరస్ అందుకున్నవారు ఇంకెంత మందిని ఇన్ఫెక్ట్ చేసి వుంటారో ఆలోచిస్తేనే వళ్లు వణుకు పుడుతోంది.

మనం రోడ్లల్లో మాట్లాడుకోవడానికి, ఆడుకోవడానికీ, పాడుకోవడానికి సమయం కాదిది. స్వీయ గృహ నిర్బంధానికి మనం కట్టుబడి ఉండకపోతే మన, మన పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన వాళ్లమవుతాము.మృత్యువు కాల సర్పంలా బుసలు కొడుతున్న ఈ సమయంలో ప్రభుత్వ ఆదేశానుసారo తిరుపతి నగర లాక్ డౌన్ కు అందరూ సహకరించాల్సిందిగా విన్నవించుకుంటున్నాను.తల్లి తండ్రులు యువకులైన తమ పిల్లలను రోడ్లపైకి రాకుండా చూడాల్సిందిగా వేడుకుంటున్నాను. 144 సెక్షన్ అమల్లోకి రావడం వలన గుంపులు గుంపులు గా తిరగడం, వాహనాల్లో బయటికి రావడం చేయకండి.