కరోనా ఎఫెక్ట్.. ఒలంపిక్స్ వాయిదా

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా అల్లకల్లోలమౌతుంది. ప్రజలు తీవ్రస్థాయిలో వణికిపోతున్నారు. ఈ వైరస్ కారణంగా ఎన్నో కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు వాయిదా పడ్డాయి. అలాగే అంతర్జాతీయ క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి.

 అయితే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒలంపిక్స్ మాత్రం నిర్వహిస్తాం అని టోక్యో గవర్నర్ వెల్లడిస్తే.. అందుకు.. కరోనావైరస్ ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ సమయంలో 2020 ఒలంపిక్స్ నిర్వహిస్తే తమ అథ్లెట్లు అందులో పాల్గొనరని.. కెనడా వెల్లడించింది. అదే బాటలో ఆస్ట్రేలియా కూడా తమ నిర్ణయాన్ని తెలిపింది.

అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు ‘డిక్‌పౌండ్‌’ ఈ సారి ఒలంపిక్స్ వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తాను అనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదని తెలియజేసారు. ఒకవేళ ఉంటె 2021లో ఉండవచ్చునని అన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే అనేక దేశాలు ఒలంపిక్స్ కమిటీలు, అథ్లెట్లు, ఒలంపిక్స్ ని వాయిదా వేయాలని ఐఓసీని కోరిన విషయం తెలిసిందే. దీంతో ఒలంపిక్స్ ను వాయిదా వేయాలని అనుకుంటున్నామని నాలుగు వారాల్లో మిగితా విషయాలపై నిర్ణయం తీసుకుంటామని డిక్‌పౌండ్‌ స్పష్టం చేశారు