బామియాన్ లో 17 మంది దుర్మరణం

బామియాన్ లో 17 మంది దుర్మరణం

అత్యంత సురక్షితమైన ప్రావిన్సులలో ఒకటైన బామియాన్ నగరంలో నిన్న (మంగళవారం) జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బామియన్‌లోని స్థానిక మార్కెట్లో పేలుళ్లు సంభవించాయని స్థానిక వార్త సంస్థ టోలో న్యూస్ తెలిపింది. అయితే ఈ పేలుళ్లకు పాల్పడిందెవరో ఇప్పటికి వరకు ప్రకటించలేదు.

బామియాన్‌కు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇక్కడ పేలుళ్లు జరగటం ఇదే తొలిసారి. జంట పేలుళ్లలో 17మంది మృతి చెందగా, 50మంది గాయపడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్‌ అరియన్‌ వెల్లడించారు. ఇటీవల జరిగిన దాడుల్లో 50మంది మృతి చెందిన విషయం విదితమే.