జగన్.. నీ డ్రామాలు ఇక ప్రజలు నమ్మరు…

మంత్రి కొల్లు రవీంద్ర
మంత్రి కొల్లు రవీంద్ర

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఐ ప్యాక్ డ్రామాలను ప్రజలు నమ్మరని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో మంత్రి రవీంద్ర ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెర లేపారని మండిపడ్డారు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.