జగన్ పాలనపై ప్రజలలో భిన్నాభిప్రాయాలు

జగన్ పాలనపై ప్రజలలో భిన్నాభిప్రాయాలు

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచింది. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజున ఆరు నెలలలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని చెప్పాడు. అయితే ఆరు నెలలలో జగన్ పాలనపై ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మొదటి నుంచి జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేశ్ తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

అయితే గుడి, బడి, ఆఖరికి శ్మశానం.. కాదేదీ వైకాపా రంగుకి అనర్హం అంటున్నారు జగన్ గారు అంటూ శ్మశానాలతో ప్రారంభించి గుడిని, ఆఖరికి బడిని కూడా వదలడం లేదు. రైతులకు భరోసా ఇవ్వడానికి మనసు రాక నెలకు రూ.625లే ఇస్తున్నారు, వృద్దులకు పెన్షన్ ఇవ్వడానికి చేతులురాక రూ.250లే ఇస్తున్నారంటూ, ఏమిటిది అంటే.. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న వైకాపా నాయకులు కనిపించిన ప్రతీ దానికీ వైకాపారంగులు వెయ్యడానికి రూ.1300 కోట్ల ప్రజాధనం ఎక్కడ నుండి వచ్చిందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. విద్యార్థులు దేవాలయంగా భావించే ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో మహామేత విగ్రహాలు, వైకాపా రంగులు వేస్తూ వైకాపా కార్యాలయాలుగా మార్చుకోవడం కంటే దారుణమైన చర్య ఉండదని విమర్శించారు.