Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటి వరకు వెండి తెరపై దుమ్ము లేపిన ఎన్టీఆర్ బుల్లి తెరపై ఎలా అలరిస్తాడో అంటూ తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన క్షణాలు వచ్చేశాయి. వెండి తెరపై రికార్డుల వర్షంను సునాయాసంగా కురిపించగల సత్తా ఉన్న ఎన్టీఆర్ బుల్లి తెరపై ఆ స్థాయి ప్రతిభను కనబర్చగలడా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోను గ్రాండ్‌గా ప్రారంభించాడు. భారీ స్థాయిలో అంచనాల నడుమ తెరకెక్కిన బిగ్ బాస్ షోను ఆసక్తికరంగా నడిపించగల సత్తా ఎన్టీఆర్‌కు ఉంది అంటూ ప్రేక్షకులు ఒక నిర్థారణకు వచ్చారు.
ఎంతో ముఖ్యమైన పార్టిసిపెంట్ల పరిచయంను ఎన్టీఆర్ ఆకట్టుకునే విధంగా చేయడం జరిగింది. ఎంట్రీతోనే డాన్స్‌తో అదరగొట్టిన ఎన్టీఆర్ వచ్చిన ప్రతి ఒక్క సెబ్రెటీని ఎంతో ఆప్యాయంగా బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకు వెళ్లారు. ముఖ్యంగా ఆడవారిని అమ్మా అంటూ సంబోధిస్తూ ఎన్టీఆర్ హోస్ట్ చేయడం అందరిని అరించింది. సందర్బానుసారంగా వ్యవహరించడంలో హోస్ట్‌లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుప్రియ ఆడపిల్ల పాట పాడిన వెంటనే ఎన్టీఆర్ కంటతడి పెట్టుకోవడం గమనించవచ్చు. ఇలా పార్టిసిపెంట్లతో ఇంట్రాక్ట్ అవుతూ, లీనం అవుతూ హోస్ట్ చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఎన్టీఆర్ యాంకరింగ్‌లో సక్సెస్ అయినట్లుగా చెప్పుకోవచ్చు అని ప్రేక్షకులు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక్కరు ఇద్దరు మాత్రం ఎన్టీఆర్ అవసరం లేకున్నా ఎక్కువ నవ్వుతున్నాడని, కాస్త గట్టిగా మాట్లాడుతున్నాడని, కొన్ని పదాలు పదే పదే పలుకుతున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే వారు ఇది ఎన్టీఆర్ మొదటి సారి హోస్ట్ చేస్తున్న షో అనే విషయం గుర్తుంచుకోవాలి.
మరిన్ని వార్తలు