పెళ్లైన నాలుగు రోజులకే భర్త పరారు.. భార్యకు షాక్

marriage

ఆంధ్రప్రదేశ్ లో వింత ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన నాలుగు రోజులకే వరుడు భార్యను విడిచిపెట్టి ఇంట్లోంచి పారిపోయాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని కోవెంల కుంట్లలో చోటు చేసుకుంది. జిల్లాలోని స్థానిక కోవెలకుంట్ల ఆర్టీసి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వీరాకుమార్ నాలుగు రోజుల క్రితం బంధువుల సమక్షంలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం అయిపోయిన తర్వాత కేవలం నాలుగు రోజులకే అమ్మాయిని విడిచి పెట్టేసి పారిపోయాడు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

కాగా ఈ అశం స్థానికంగా కలకలం రేపుతోంది. అస్సలు ఏం జరిగింది అనే విషయంపై గుసగుసలు వినపడుతున్నాయి. అయితే కాళ్ళ పారాణి ఆరకముందే ఆ యువతి పోలిస్ స్టేషన్ మెట్లెక్కి అతడిపై కేసు నమోదు చేసింది. వరుడు వేరే యువతితో ప్రేమ వ్యవహారం కారణంగానే ఇంట్లోంచి పారిపోయాడని యువతి తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా వరుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడికోసం గాలింపులు చేపట్టారు.