Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులోనే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తంలో ఫేమస్ స్టంట్ కొరియోగ్రఫర్‌గా పేరు తెచ్చుకున్న పీటర్ హెయిన్స్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. ఏమాత్రం చదువుకోలేక పోయిన పీటర్ చిన్నప్పటి నుండి ఫైట్స్ చేస్తూనే ఉన్నాడు. తన తండ్రి చదువు నేర్పించకున్నా ఫైట్స్ నేర్పించడం వల్ల జీవితంలో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను అంటూ పీటర్ హెయిన్స్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తూ సస్సెస్ఫుల్ స్టంట్స్ కొరియోగ్రఫర్‌గా దూసుకు పోతున్న పీటర్ హెయిన్స్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ను డాడీ అంటూ సంభోదిస్తాడట.
తన తండ్రి తనకు ఫైట్స్ నేర్పిస్తే త్రివిక్రమ్ సినిమా అంటే ఏంటీ, అసలు సినిమాలో ఫైట్స్ గురించి చెప్పడం వల్లే ఆయన్ను తాను డాడీ అంటూ పిలుస్తాను అంటూ పీటర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు పీటర్ ఎక్కువగా రాజమౌళి మరియు పీటర్ హెయిన్స్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలకు ఎక్కువ చేశాడు. రాజమౌళి ఒక గొప్ప దర్శకుడు అంటూ పీటర్ హెయిన్స్ కితాబు ఇచ్చాడు. పలు సినిమాలు చేస్తున్నా కూడా వీరిద్దరి నుండి పిలువు వస్తే ఖచ్చితంగా వెళ్తాను అని, తెలుగులో వీరిద్దరు అంటే తనకు అమితమైన ఇష్టం మరియు అభిమానం అంటూ పీటర్ చెప్పుకొచ్చాడు. స్టంట్స్ మాస్టర్స్లలో ఎక్కువ గుర్తింపు దక్కించుకున్న వ్యక్తిగా పీటర్ హెయిన్స్ నిలుస్తాడు.