పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరగడం వల్ల ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు కూడా ధరలని పెంచాయి. ఢిల్లీలో ఏకంగా లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 73 రూపాయల 20 పైసలకి చేరుకుంది. ఈ నాలుగు రోజుల్లో పెట్రోల్ 60 పైసలు పెరిగింది. ధరల పెరుగుదల, తగ్గుదలలో మార్పులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్, ఇతర పన్నుల ఆధారంగా జరుగుతున్నాయి.
మెట్రో నగరాల్లో గురువారం పెట్రోల్ ధర లీటరుకు 16 పైసల చొప్పున పెరగగా డీజిల్ ధర మాత్రం అదే విధంగా ఉంది. రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 15 పైసలు తగ్గి 72.24 ను చేరుకుంది. ఈ రెండు నెలలలో కనిష్ట స్థాయిలో బుధవారం 72.09 వద్ద ముగిసింది. గత పది రోజుల్లో పెట్రోలు ధర 85 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోలు ధర 78.16 రూపాయలు ఉండగా డీజిల్ ధర 71.80 రూపాయలు ఉంది.