మరోసారి పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు

మరోసారి పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు

దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దాదాపు రెండు నెలల తరువాత జులై 12 నుంచి చమురు ధరలు కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు చమురు ధరలు అలాగే ఉన్నా.. గురువారం రోజు వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి.

పెట్రోల్‌ ధర 31 నుంచి 39 పైసా వరకు పెరగ్గా..డీజిల్‌ ధర 15 నుంచి 21 పైసా వరకు పెరిగింది. దీంతో చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాల్లో చమురు ధరలు రికార్డ్‌ స్థాయిల్ని నమోదు చేశాయి.

కాగా, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశంలో చమురు ధరల పెరగడానికి కారణమైందని రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా అమెరికన్‌ మార్కెట్‌లో క్రూడ్‌ అయిల్‌ స్టాక్స్‌ ప్రభావం లేకపోవడంతో పాటు సెప‍్టెంబర్‌ నాటికి చమురు ధరల రవాణా తగ్గిపోతుండడంతో వాటి ప్రభావం దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది.