ఫార్మసిస్ట్‌ ఆత్మహత్య

ఫార్మసిస్ట్‌ ఆత్మహత్య

జిల్లాలోని ఏలూరులో వెదురుపర్తి సౌజన్య (24) అనే ఫార్మసిస్ట్‌ ఆత్మహత్యకు పాల్పడింది. తన నివాసంలోనే ఉరివేసుకోగా ఆసుపత్రికి తరలించేలోపే సౌజన్య మృతి చెందింది. సౌజన్య హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. ఏలూరుకు చెందిన సింహాద్రి బాలు అనే వ్యక్తి మోసం చేయడం వలనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని సౌజన్య తండ్రి ఆరోపిస్తున్నారు. బాలు గతంలోనూ ఓ యువతిని మోసగించిన కేసులో ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే సౌజన్య తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సెల్ఫీ వీడియో తీసుకొని అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన టూటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.