బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బంధువు మీరా చోప్రా తెలుగు, హిందీ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. తెలుగులో ఆమె బంగారం, వాన, గ్రీకువీరుడు, మారో వంటి సినిమాల్లో నటించారు. తాజాగా సెక్షన్ 375 అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు. అలాగే.. ఈ బొద్దుగుమ్మ తాజాగా ఓ రహస్యాన్ని ప్రపంచానికి తెలిపింది. అదేమంటే.. తన తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్ లాక్కుపోయారనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
తాజాగా తన తండ్రి మీరా ఢిల్లీలోని పోలీస్ కాలనీలో వాకింగ్‌కి వెళ్లినప్పుడు స్కూటర్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు కత్తితో బెదిరించి ఫోన్ లాక్కెళ్లి పోయారు. సురక్షితమైన స్థలంగా చెప్పుకొనే ఢిల్లీలో ఇలాంటి ఘటన జరగడం దారుణమని మీరా చోప్రా వివరించారు. కాగా ఈ ఘటనపై ఉత్తర ఢిల్లీ డీసీపీ స్పందించారు. మేము మీకేసును విచారిస్తామని.. మరికొన్ని వివరాలు అందించాలని కోరారు. పీసీఆర్ పోలీస్ లేన్, మోడల్ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్ రోడ్డులో ఈ ఘటన జరిగిందని మీరా చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.