సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. ఒక సారి మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే మనకి పోషక పదార్థాలు బాగా అందుతాయి. డైట్‌లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి అన్న సంగతి మనకు తెలుసు. అయితే పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.ముందుగా ఈ పులియబెట్టిన ఆహారపదార్ధాలు ఏవి అనేది చూస్తే.. యోగర్ట్, పచ్చళ్ళు, కాటేజ్ చీజ్ మొదలైనవి పులియబెట్టిన ఆహారపదార్ధాలు.
అయితే వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చా అని ఆలోచిస్తున్నారా…? అవును ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు అని రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఇంఫ్లేమేషన్ కూడా తగ్గుతుంది. ప్రమాదకరమైన రోగాలు నుండి కూడా బయట పడడానికి వీలవుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది కదా మరి ఇంకా ఎన్నో విషయాలు దీని కోసం తెలుసుకుందాం వాటి కోసం కూడా ఓ లుక్ వేసేయండి.పులియబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్ ని కూడా ఇది తగ్గిస్తుంది.
ఓ పరిశోధన ప్రకారం ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఆరోగ్యంతో ఉన్న 36 మంది పెద్ద వాళ్ళని తీసుకుని క్లినికల్ ట్రైల్స్ నిర్వహించారు. 10 వారాల పాటు ఆహార పదార్థాలను ఇచ్చారు. వీటిలో పులియబెట్టినవి మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు వాళ్ళకి ఇచ్చారు. అయితే రెండు రిజల్ట్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి. రోగ నిరోధక శక్తి, గట్ మైక్రోబియల్ లో చాలా తేడా కనపడడం జరిగింది.అయితే ఏది తీసుకోవడం మంచిది అనేది మనం చూస్తే… యోగర్ట్, ఫెర్మెంటేడ్ కాటేజ్ చీజ్ మరియు పులియబెట్టిన ఇతర కూరగాయల పచ్చళ్ళు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యం చాలా బాగుంటుందని తెలుస్తోంది.
మైక్రో బయాలజీ ప్రొఫెసర్ చెప్పిన దాని ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే చాలా మేలు కలుగుతుందని తెలుస్తోంది. అలానే మీ ఆరోగ్యంలో కూడా మీరు మార్పులు గమనించవచ్చు అని చెబుతున్నారు.మీ ఆరోగ్యం విషయంలో చాలా తేడాలని మీరు గమనించవచ్చు. సాధారణంగా మనకి 19 రకాల ఇమ్యూనిటీ ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయి. వీటిని బ్లడ్ శాంపిల్స్‌లో కనుకొవచ్చు.అయితే ఇలా ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్థాలని తీసుకోవడం వల్ల అవి తగ్గాయని కూడా తేలింది. అదే విధంగా ఇలా పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్కు తగ్గుతుంది. అయితే గింజలు ఉన్న కూరగాయలు పండ్లు తీసుకున్న వాళ్లలో ఈ 19 ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ తగ్గలేదు.
అయితే కేవలం ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇది తగ్గడం లేదు. ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇటువంటి చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు అని తెలుస్తోంది.అలానే ఇలా ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల బరువును మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. అలానే డయాబెటిస్, క్యాన్సర్, కార్డియో వాస్క్యులర్ సమస్యలు కూడా తగ్గుతాయి.ఇది ఇలా ఉంటే ఈ క్లినికల్ ట్రైల్స్ కోసం పది వారాల పాటు ఆహార పదార్థాలను ఇవ్వడం వాటిని పరిశీలించడం నాలుగు వారాల తర్వాత ఈ మార్పుల్ని చూడడం జరిగింది. అయితే చూశారా ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్థాల వల్ల ఎన్నో చక్కటి ప్రయోజనాలు కలుగుతాయో.
కాబట్టి డైట్ లో వీటిని కూడా మీరు తీసుకుంటూ ఉండండి. వీటి వల్ల కూడా మీ ఆరోగ్యం బాగుంటుంది అలానే చాలా సమస్యలు నుండి మీరు బయట పడడానికి వీలవుతుంది. అయితే మరి ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇతర బెనిఫిట్స్‌ని కూడా మనం పొందొచ్చు. వాటి కోసం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం.పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇక లాభాల గురించి చూస్తే…. నిజంగా పులియబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు కేవలం చాలా సమస్యలను మాత్రమే కాకుండా మరెన్నో ఇతర ప్రయోజనాలను కూడా ఇస్తుంది.వాపు లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
సాధారణంగా ఈస్ట్ ప్రక్రియ ద్వారా ఈ ఫెర్మెంటేడ్ ఫుడ్ ని తయారుచేస్తారు.దీనితో వెంటనే వాటి రుచి లో కొంచెం పులుపు ఉంటుంది. దీంతో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిని ప్రోబయోటిక్స్ అంటారు.ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి ఈ పులియబెట్టిన ఆహారపదార్థాలు మనకి బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయం చేస్తాయి. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు అవసరాన్ని కూడా తీరుస్తుంది.వైరల్, ఫ్లూ మొదలైన అంటు వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే సాదారణంగా మనకు ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి బ్యాక్టీరియా అవసరం. ఇలా ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు మంచి బ్యాక్టీరియా సమృద్ధిగా దొరుకుతుంది.
దీనితో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఆహారంలో ఉండే మంచి బ్యాక్టీరియా జీవ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. అదే విధంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు నుంచి మంచి రిలీఫ్ ని కూడా మీరు పొందవచ్చు. అయితే పులియబెట్టిన ఆహారంలో ఉండే లాక్టిక్ యాసిడ్ పేగులకు చాలా మంచిది. పేగుల్లో ఉండే మురికి చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ చాలా మందికి వీటి ప్రాముఖ్యత తెలియదు. మీరు ఇప్పుడు చూశారు కదా పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎన్ని చక్కటి ప్రయోజనాలు పొందవచ్చో. మరి వాటిని రెగ్యులర్ గా మీ డైట్ లో తీసుకుని ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొంది ఆరోగ్యంగా ఉండండి. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి.