పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేసవి బరిలో ఈ సినిమాని నిలపాలన్నది దిల్ రాజు ప్లాన్. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. పింక్ రీమేక్ ని మే 15 న విడుదల చేస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. గబ్బర్ సింగ్ మే 11 న వచ్చింది. దానికి పంపిణీ దారుడు దిల్ రాజు నే. ఆ సెంటిమెంట్ ఇక్కడ పని చేస్తుందని దిల్ రాజు నమ్మకం. పైగా హిందీ, తమిళ వెర్షన్ లతో పోలిస్తే… చాలా మార్పులు చేర్పులు చేశామని దిల్ రాజు ముందే చెప్పేశారు. ఇది వరకు చూసిన పింక్ సినిమాలా ఈ రీమేక్ వుండదని, హిందీ, తమిళ సినిమాలు చూసిన వాళ్లకి కూడా కొత్తగా అనిపిస్తుందని హామీ ఇచ్చారు దిల్ రాజు. పవన్ తో ఓ సినిమా చేయాలన్నది తన కల అని.. అది పింక్ రీమేక్ తో వచ్చిందని, దాన్ని తప్పకుండా నిలబెట్టు కుంటామని దిల్ రాజు చెప్పారు. ఉగాది నుంచి ప్రమోషన్స్ మొదలు పెడతామని, టైటిల్ కూడా ఉగాది రోజునే ప్రకటిస్తామని అన్నారు.