తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. మంగళవారం ఆయన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గతం కంటే 3 రెట్లు ధాన్యం సేకరణ పెంచామని.. మద్దతు ధర 5 సార్లు పెంచామని గోయల్ అన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రులంతా బిజీగా ఉన్నామని.. తెలంగాణ మంత్రులకు ఖాళీ ఎలా దొరికిందని ఆయన ప్రశ్నించారు. వారు శనివారం నుంచి ఢిల్లీలోనే ఉన్నారు.
తెలంగాణ మంత్రులను మేము ఆహ్వానించలేదన్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎంవోయూ ప్రకారమే ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకుంటాం. ఐదేళ్లలో ధాన్యం మూడు రెట్లు పెరిగిందన్నారు.