అమెరికాలో ఘోర విమాన ప్రమాదం

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం

అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు గాల్లో ఢీ కొట్టుకున్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలు రెండూ కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

మృతుల్లో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారని చెప్పారు. రెండు విమానాలు ఢీ కొట్టుకోవడం వెనుక ఉన్న కారణాన్ని ఇంకా కనుగొనలేదని తెలిపారు. సరస్సులో మునిగిపోయిన రెండు విమానాల శకలాలను సోనార్ సాయంతో గుర్తించినట్లు వెల్లడించారు. వాటిని బయటకు తీయడానికి ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతుందన్నారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.