ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా స‌హా వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభ‌వించింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఇండోనేషియా, సింగ‌పూర్ స‌హా భార‌త్‌లోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో భూమి కంపించింది. అత్య‌ధికంగా ఇండోనేషియాలో భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 6.3గా న‌మోదు కాగా, సింగ‌పూర్‌లో తెల్ల‌వారుజామున 4.24 గంట‌ల‌కు రిక్ట‌ర్ స్కేలుపై 6.1గా న‌మోదైంది.

అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ స‌మీపంలో తెల్ల‌వారుజామున 1:33 గంట‌ల‌కు రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త‌ 3.4 గా న‌మోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్ల‌డించింది. జావా తీరం స‌ముద్ర‌గ‌ర్భంలో 528 కిలోమీటర్ల లోతులో భూకంప‌న కేందద్రాన్ని గుర్తించినట్టు ఇండోనేషియా వాతావ‌ర‌ణ జియోఫిజిక్స్ అధికారులు వెల్ల‌డించారు. అయితే ఈ భూకంపం వ‌ల్ల ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని , సునామీ వ‌చ్చే అవ‌కాశం కూడా లేద‌ని పేర్కొన్నారు.