రష్యాలోని పెట్రోపావ్‌లోవిస్క్ – కామ్‌చట్‌స్కై నగరం నుంచి పలానా నగరానికి 28 మందితో బయలుదేరిన విమానం కూలిపోయింది. విమానం ల్యాండ్ కావాల్సిన విమానాశ్రయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో విమానానికి సంబంధించి శకలాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆంటోనోవ్ ఏఎన్–26 విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ల్యాండింగ్‌కు కొంత సమయం ముందు రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. విమానంతో కమ్యూనికేషన్ ఆగిపోయింది. అనంతరం విమానానికి సంబంధించిన శకలాన్ని ఒకోట్స్ సముద్ర తీరప్రాంతంలో కనుగొన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సొలొడోవ్ చెప్పారు. విమానంలోని వారెవరూ బతికి ఉండకపోవచ్చని రష్యా మీడియా పేర్కొంది. విమానం సముద్రంలోని రాతిబండలను గుద్దుకొని ఉండొచ్చని ప్రాథమిక అంచనా.