ఇంతకీ అదెక్కడంటే.. తూర్పుగోదావరి జిల్లాలో గల పలు హోటల్స్‌పై ఫుడ్ సెఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. అలాగే.. అమలాపురంలోని హోటల్స్, బేకరీల్లో తనిఖీలు చేశారు.. పరిశుభ్రత పాటించుకుండా నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నట్లు అక్కడ అధికారులు గుర్తించారు. అక్కడ జరుగుతున్న తతంగం చూసి అధికారులు అవాక్ అయ్యారు. కుళ్లిన మాంసాన్ని చూసి ఆశ్చర్య పోవడం వారి వంతైంది. హోటల్స్‌లో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్, మటన్‌తో పాటూ నాణ్యతలేని పదార్థాలను సత్వరమే సీజ్ చేసి, సదరు హోటల్ యాజమాన్యానికి గట్టి వర్ణింగ్ ఇచ్చారు.
ఆహారపదార్థాలలో నిషేధిత కలర్స్ కలిపి అమ్ముతున్నట్లు గుర్తించారు. అలాగే ఓసారి వాడిన వంటనూనెల్ని మళ్లీ, మళ్లీ ఉపయోగిస్తున్నట్లు తేలింది. అమలాపురంలోని ఏడు హోటల్స్‌తో పాటూ మరికొన్ని బేకరీల్లోనూ తనిఖీలు చేశారు. హోటల్స్ నిబంధనలు పాటించకపోవడంతో జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి తప్పులు జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. నిల్వ ఉంచిన మాంసాహారాన్ని కస్టమర్లకు విక్రయిస్తూ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. కుళ్లిన మాంసాన్ని అలాగే వండేస్తున్నట్లు తేలింది. ఇలాంటి ఆహార పదార్థాలు తింటే ఆస్పత్రిపాలవ్వడం ఖాయమంటున్నారు స్థానికులు.
ఇక సరదా కోసం.. తినాలనిపించిన సందర్భంలో బిర్యాని ప్రియులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. రెస్టారెంట్లలో తయారవుతున్న బిర్యానీ మనం అనుకున్నంత స్వచ్ఛతగా ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. బిర్యానీ తయారీ వెనుక విరుద్ధ వ్యవహారాలు సాగుతున్నాయి. ఈ తయారీలో కుళ్లిన మాంసం, చెడిపోయిన ఆహార పదార్థాలు వాడుతున్నట్టు తెలుస్తోంది.
కొన్ని రెస్టారెంట్లలో వ్యాధులు వచ్చిన మేక, గొర్రె మాంసం, చనిపోయిన కోళ్లను సైతం వాడుతునట్టు సమాచారం. రెండు, మూడు రోజులపాటు ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మేక, గొర్రె కోడిమాంసం ఉపయోగిస్తున్నట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోరూరించేలా మసాల దినుసులు, వెనిగర్ లాంటివి కలిపి చూడగానే తినాలనిపించేలా కనిపించేలా బిర్యానీ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది.