ప్రేమ పేరుతో మోసం చేసి, యువతి ఆత్మహత్యకు కారణమైన నిందుతుడిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై మధుసూదన్గౌడ్ తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డికి చెందిన మైనర్ బేతి స్నేహను పట్టణానికి చెందిన రఘుపతి గత యేడాది మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశారు.
ఆమె తల్లిదండ్రులకు, స్నేహితులకు ప్రేమ విషయం తెలిసేట్లు చేశాడు. తర్వాత మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని స్నేహను మోసం చేశాడు. తాను ప్రేమ పేరుతో మోసపోయాయని భావించి మనో వేధనతో ఈనెల 1న ఇంట్లో ఉరివేసుకుని స్నేహ ఆత్మహత్య చేసుకుంది. దీంతో కేసు నమోదు చేసిన నిందితుడు రఘుపతిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు.