కరాటే కల్యాణిపై కేసు

కరాటే కల్యాణిపై కేసు

సినీ నటి కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్ట పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలను సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతం చేయడంపై రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన నితేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో కరాటే కల్యాణిపై జగద్గిరి గుట్ట పీఎస్‌లో కేసె నమోదైంది.