ఎన్నికల ప్రవర్తనా నియామావళికి సంబంధించి పంజాబ్‌లోని మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సినీ నటుడు సోనూ సూద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా నియోజకవర్గం నుంచి సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా అధికారులు ఆదివారం సోనూను అడ్డుకున్న సంగతి తెలిసిందే.