వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణితో సహా మరో నలుగురు నిందితులు 12 రోజులుగా పరారీలో ఉన్నారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్ ను కాకాణి అండ్ బ్యాచ్ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. కాకాణి దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.