స్మగ్లర్ భార్యపై పోలీస్.. దందా.. రాత్రి గడిపితే.. వదిలేస్తా

ప్రజలకు రక్షణ కల్పించే భటులే యమకింకరులైతే ఇక లోకం గతి ఏమైపోను. పోలీసులు కామాంధులుగా మారితే వ్యవస్థ ఎటుపోను. అదే తాజాగా రాజస్థాన్ లో జరిగింది. ఓ స్మగ్లర్ భార్యపై మనసుపారేసుకున్న ఓ పోలీసు అధికారి.. రాత్రికి తనను సుఖపెడితే తన భర్తను వదిలేస్తానని ఛాన్స్ ఇచ్చాడు.

అది రాజస్థాన్‌‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ఓ స్మగ్లర్ భార్యకు ఎదురైన ఘటనపై అధికారులు విచారణ జరిపారు. లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీసు అధికారి కమల్‌దాస్ చరణ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తి 10 రోజుల క్రితం కారులో డ్రగ్స్(ఓపీమ్) తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కానీ.. స్మగ్లర్ చాకచక్యంగా వ్యవహరించి వారి నుంచి తప్పించుకున్నాడు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జోధ్‌పూర్‌లోని ఆర్‌జీ పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి కమల్‌దాస్ చరణ్.. అతడి కారు నంబర్ ఆధారంగా తీవ్రంగా గాలించాడు. రెండ్రోజుల్లోనే నిందితుడిని డ్రగ్స్‌తో పాటు పట్టుకొని జైల్లో వేశాడు.

ఆ తర్వాత ఆ కేసులో ట్విస్ట్ జరిగింది. ఆ స్మగ్లర్‌ని వదిలేసేందుకు రూ.2లక్షలకు బేరమాడాడు ఆ పోలీస్. నిందితుడి భార్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కమల్‌దాస్‌ను కలిస్తే.. డ్రగ్స్‌ను తమ వద్ద ఉంచుకుని తన భర్తను, కారును వదిలేస్తామని… అందుకు రూ.2లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు. అందుకు ఆమె ఓకే అని చెప్పి.. లక్ష అప్పు చేసి కట్టింది. మరో లక్షకు చెక్ రాసి ఇచ్చింది. ఆ తర్వాతి రోజు ఆమెను పిలిచి పోలీసు రహస్యంగా మాట్లాడి తనకు ఏం వద్దని.. తనతో ఓ రాత్రి గడిపితే చాలని కోరాడు. ఆమె తాను అలాంటి దాన్ని కాదని నిరాకరించింది. అందుకు పోలీస్ మాట వింటే సరి.. లేకపోతే వ్యభిచారం కేసులో నిన్ను బొక్కలో వేస్తామని చెప్పాడు.

అయితే తనకు కాస్త ఇవ్వు ఆలోచించి చెప్తామని చెప్పిన ఆమె నేరుగా ఏసీబీ ఎస్పీ అజయ్ పాల్ లంబాకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన మరో లక్ష రూపాయలు ఆమెకిచ్చి కమల్‌దాస్ దగ్గరకు పంపారు. మీతో ఓ రాత్రి గడపడం నాకిష్టం లేదు. కావాలంటే మరో లక్ష రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పింది. అందుకు అంగీకరించిన కమల్‌దాస్ ఆమె నుంచి డబ్బులు తీసుకొనే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే అతడిపై అవినీతి, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మొత్తానికి పోలీసు ఆటను ఆమె భలే చేధించింది. ఉపాయమంటే అదేమరి.