భాగ్యనగరంలో ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసుల ఆంక్షలు…

Police restrictions on agitations of IT employees in Bhagyanagaram
Police restrictions on agitations of IT employees in Bhagyanagaram

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్​లో ఐటీ ఉద్యోగుల గత మూడ్రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు తాజాగా ఇవాళ కూడా నిరసన చేపట్టాలని నిర్ణయించిన ఐటీ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. వారి ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల అనుమతి లేకుండా ఐటీ కారిడార్ తోపాటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఆందోళనలు, ధర్నాలు చేసిన కఠిన చర్యలు తప్పవని మాదాపూర్ డీసీపీ సందీప్ హెచ్చరించారు.

డీసీపీ ఈ మేరకు ఐటీ ఉద్యోగులు, తెలుగుదేశం నాయకులను ఉద్దేశిస్తూ ప్రకటన విడుదల చేసినారు, సామాన్య ప్రజలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీసీపీ అన్నారు. తెలుగుదేశం నాయకులతో కలిసి పలువురు ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులు ఆందోళనకు ప్రణాళిక చేసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు మణికొండలో , రేపు మధ్యాహ్నాం 1 గంట నుంచి కార్ ర్యాలీ నానక్ రాంగూడ ఓఆర్ఆర్ లో, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ లో నిరసనలకు సన్నాహాలు చేసుకున్నారు. పోలీసులు ఈ విషయం తెలుసుకుని, ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై ఆంక్షలు విధించారు. ఆందోళనలు, ధర్నాల విషయాన్ని సామాజిక మాద్యమాల్లో షేర్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.