రాహుల్ పై దాడి చేసిన వారిని గాలిస్తున్న పోలీసులు

రాహుల్ పై దాడి చేసిన వారిని గాలిస్తున్న పోలీసులు

గచ్చిబౌళిలోని ప్రిజమ్ పబ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటున్న రాహుల్ పై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిక్ రెడ్డి తనపై దాడి చేశాడని మీడియాకు రాహుల్ వివరించాడు. మాటా మాట పెరిగి వారు అక్కడున్న బీర్ బాటిల్స్‌తో అతడిపై దాడి చేసాడని పేర్కోన్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో రాహుల్ గాయపడడంతో అతన్ని దగ్గరలో గల ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అసలు ఏం జరిగిందో.. ఎందుకు దాడి చేశారో మీడియాకు వివరించాడు. తనపై దాడి గురించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అంతేకాదు తనకు సాయం చేయాలనీ, ఈ విషయంలో తనను ఊరికే కొట్టారనీ న్యాయం చేయాలంటూ రాహుల్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా సోషల్ మీడియా వేదికగా విన్నవించాడు.

రాహుల్‌ సిప్లిగంజ్‌పై పబ్‌లో దాడికి పాల్పడిన నిందితుల కోసం గచ్చిబౌళి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రధాన నిందితుడైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోదరుడు రితీష్‌రెడ్డితోపాటు అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. రాహుల్‌పై దాడి తర్వాత వారంతా కలిసి బెంగళూరుకు పారిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి వారికోసం గాలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో నిందితులు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం.