ఢిల్లీలో పక్కింటి వ్యక్తులపై పోలీస్ షూట్… ముగ్గురికి గాయాలు

దేశ రాజధానిలో ఘోరం జరిగింది. పక్కింటి వ్యక్తులతో కానిస్టేబుల్ కుటుంబానికి గొడవ జరిగి అది కాల్పులకు దారి తీసింది. దీంతో ముగ్గురికి బుల్లెట్లు తగిలి తీవ్ర గాయాల పాలయ్యారు. ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి.  ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అక్కడ ఓ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న గన్‌తో కాల్పులకు దిగాడు. సీలంపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి… మీట్ నగర్ లోని ఓ ఇంటి వద్ద కాల్పులు జరిపారు. ఈ మొత్తం గొడవలో ఐదుగురు గాయపడగా… అందులో ముగ్గురికి బుల్లెట్ గాయాలు తగిలాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.  అయితే కానిస్టేబుల్ కాల్పులకు అక్కడ జరిగిన గొడవే కారణమని సమాచారం అందుతుంది.
 అసలు విషయం ఏం జరిగింది అంటే.. పక్కింటి వాళ్లకి కానిస్టేబుల్ తమ్మడిక మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చిన్న గొడవ కాస్త చినికి చినికి గాలివానలా మారింది. దీంతో కానిస్టేబుల్ సోదరుడిపై పక్కింటి వ్యక్తి దాడికి దిగాడు. ఈ దాడిలో సోదరుడి తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో సోదరుడిపై దాడి చేసిన వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు గాయపడ్డారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.