ఏపీలో శర వేగంగా మారిపోతున్న రాజకీయ పరిస్థితులు

ఏపీలో శర వేగంగా మారిపోతున్న రాజకీయ పరిస్థితులు

ఏపీలోని శర వేగంగా మారిపోతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే రాబోయే కొద్ది రోజుల్లోనే ఏదో పెద్ద ఎత్తునే జరగబోతుందా అన్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.ఆ పరిణామాలు జగన్ ప్రభుత్వం కూలిపోవడమేనా అంటే సీనియర్ మోస్ట్ నాయకులే గత చరిత్రను ఎత్తి చూపుతూ అత్యధిక మెజార్టీతో మొట్టమొదటిసారి గెలుపొందిన జగన్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందేమో అని అంటున్నారు.

ఈ విషయాన్నే గతంలో జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అయిన ఉండవల్లి అరుణ్ కుమారే జగన్ సర్కార్ కు హెచ్చరికలు జారీ చేసారు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏపీలోని పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న నిరసనలు చూస్తుంటే ఆయన చెప్పిన మాటలే నిజం అవుతాయా అని ఓ పక్క అనిపిస్తుంటే దానినే జనసేన పార్టీ కీలక నేత అయినటువంటి బొలిశెట్టి సత్యన్నారాయణ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

భారీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వారు 9 నెలల్లోనే గద్దె దిగిపోయిన మహామవులు ఉన్నారని 1972లో శ్రీ పీవీ నరసింహా రావు గారి ప్రభుత్వం 219 అసెంబ్లీ స్థానాలు గెలుపొందగా ప్రజలు దింపేసారని అలాగే 1994లో నందమూరి తారక రామారావు 213 స్థానాలతో ఉన్నపుడే అదే 9 నెలల్లో దిగిపోయింది అని ఈ లెక్కన ఇప్పుడెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి రాబోయే కొన్ని రోజుల్లోనే ఏదొ పెద్ద పెను మార్పులే జరిగేలా ఉన్నాయి అని చెప్పాలి.