ఏపీలో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి సెక్యూరిటీపై వివాదం ఆగట్లేదు. జగన్‌కి రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందంటున్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స. 1100 మంది పోలీసులతో రక్షణ కల్పించామని చెబుతున్నారని, అయితే హెలిపాడ్ దగ్గర వంద మంది పోలీసులు కూడా లేరన్నారు. ఇక బొత్స కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు.. వైసీపీ నేతలు డబ్బు పంచిపెట్టి హెలికాప్టర్ దగ్గరకు జనసమీకరణ చేశారని ఆయన మండిపడ్డారు. ఈ వివాదం ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి.