తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 లక్షల ‘గృహలక్ష్మి’ దరఖాస్తులను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 15లక్షల పైచిలుకు దరఖాస్తుల్ని పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని భావిస్తోంది.
ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో 12 లక్షలు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు. అయితే వాటిని తప్పించి… ఒకప్పటి ఇందిరమ్మ ఇళ్ల పిటిషన్ల తరహాలో గ్రామ సభలో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
కాగా, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ నేతలను కలవనున్నారు. అనంతరం అధిష్ఠాన పెద్దలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి రేవంత్ రెడ్డి ప్రధానిని కలవబోతున్నారు. మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని రేవంత్ కలుస్తారని పార్టీ నేతలు వెల్లడించారు.