Political Updates: సింగరేణిలో గుర్తింపు సంఘంగా AITUC..!

Political Updates: AITUC as a recognition organization in Singareni..!
Political Updates: AITUC as a recognition organization in Singareni..!

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ సత్తా చాటింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్నికల్లో INTUCపై దాదాపు 2 వేల ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలుపొందినట్లు తెలిసింది. అయితే అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మొత్తం 11 ఏరియాలు ఉండగా 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల INTUC ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని సంఘం తన ఉనికిని కోల్పోయింది.

బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో AITUC విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో AITUC, రామగుండం-3లో INTUC గెలుపొందింది. కొత్తగూడెం కార్పొరేట్‌ కార్యాలయంలో, ఇల్లెందు, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో INTUC విజయకేతనం ఎగురవేసింది. గెలిచిన అభ్యర్థులకు మద్దతుగా కార్మికులు సంబరాలు చేసుకున్నారు. విజయానికి మద్దతు పలికిన కార్మికులకు విజేతలు ధన్యావాదాలు తెలిపారు. కార్మిక సంఘ నేతలు, కార్మికులు బాణసంచా కాల్చుతూ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.