తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకు పోరాడిన భట్టి విక్రమార్కఎట్టకేలకు డిప్యూటీ సీఎంతో సెటిల్ అయ్యా రు. అయితే ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రతిపాదనకు ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎట్టకేలకు భట్టికి ఆ పదవి దక్కనుంది. తెలంగాణ సీఎం రేసులో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. చివరకు రేవంత్‌పై అధిష్టానం మొగ్గుచూపడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మధిర ఎమ్మెల్యే మల్లు విక్రమార్క తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ప్రమాణస్వీ కారోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే మధిర ఎమ్మెల్యే విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఖమ్మం జిల్లాకు అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భట్టి 2009, 2014, 2018 మరియు 2023 ఎన్నికలలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యా రు. 2009 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా.. 2011 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2019 నుంచి 2023 వరకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. మల్లు భట్టి విక్రమార్క 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామం నుంచి ప్రారంభమైన ‘పీపుల్స్ మార్చ్’ రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెం బ్లీనియోజకవర్గాల పరిధిలో 1,365 కిలోమీటర్ల మేర పూర్తి చేసింది. జూలై 2న రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా 23 జన గర్జన సభ జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం లో ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రితో పాటు మరో ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఖమ్మం నుంచి గెలుపొందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 9 చోట్ల గెలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మొత్తం మూడు స్థానాలు దక్కడం విశేషం.