సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ సమావేశం జరగనుంది. వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కలిపించడంతో తమకు ఆర్థికంగా నష్టం చేకూరుతుందని ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వారితో భేటీ అయ్యి.. వారి అభిప్రాయాలను, ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. వారికి పలు హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి రూ.12000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పోందుపర్చింది. తాజాగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం పథకంపై విధివిధానాలు రూపొందించాలంటుంది ప్రభుత్వం. ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తించాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆటో ఓనర్లుకు ఇవ్వాలా, ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా అనే దానిపై ఇంకా క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆటోలను అద్దెకు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఓనర్లకు ఇస్తే తమ పరిస్థితి ఏంటని డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్లకు ఇస్తే ఆటో కొన్న తమ పరిస్థితి ఏంటని ఓనర్లు ప్రశ్నిస్తున్నారు.