హైదరాబాదులోని ఎల్బీనగర్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలను కాపాడింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. మత సామరస్యాలను కాపాడేందుకు శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు. ప్రపంచానికి డిసెంబర్ నెల మీరాకిల్ మంత్ అని, మైనార్టీలు సెక్యులర్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. ఎర్రకోటపై జెండా ఎగిరినప్పుడు సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ఉంటుందన్నారు. మణిపూర్ లో జరిగిన అల్లర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయలేకపోయాయి అని తెలిపారు.
మణిపూర్లో జరిగినటువంటి ఘటనలు మరి ఎక్కడ జరగకుండా యువత బాధ్యత తీసుకోవాలని కోరారు . నిస్సహాయులకు చేయూత నివ్వడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యము అని, ఏకె ఆంటోనీ, ఆస్కార్ ఫెరనాండెజ్ వంటి నేతలు పార్టీ కోసం అహర్నిశలు పని చేశారు. ఏసుక్రీస్తు మాకు ఆదర్శం అని, భవిష్యత్తులో ఏ బాధ్యత ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటామని ప్రజావాణిలో సమస్యలు స్వేచ్ఛగా చెప్పేందుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.