రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కౌలు రైతుల గుర్తింపు, మహాలక్ష్మి, భూ రికార్డులతో ముడి పడిన సమస్యలు గురించి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నట్లు సమాచారం. శాసనసభ సమావేశాల వల్ల అన్ని జిల్లాలో కలెక్టర్లతో నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. అభివృద్ధి కార్యక్రమాలు పథకాలకు సంబంధించిన విషయాలపై సమాచారం సిద్ధం చేసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా వాని కార్యక్రమాలను జిల్లాలకు పట్టణాలకు విస్తరించాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఏ ఏ వారాలలో నిర్వహిస్తే బాగుంటుందనే విషయంపై సీఎం కలెక్టర్లతో సమావేశం జరుపనున్నారు. రాష్ట్రంలో గృహ లక్ష్మీ పథకాన్ని త్వరగా అమలు చేయాలని అలాగే అందుకు సంబంధించిన ఇళ్ల స్థలాల గుర్తింపు నిధుల పంపిణీ మొదలగు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.