Political Updates: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ప్రమాణస్వీకారం.

Political Updates: Deputy CM Bhatti, Ministers taking oath..
Political Updates: Deputy CM Bhatti, Ministers taking oath..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత సీఎంగా రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు