ఇవాళ ఇండియా కూటమి కీలక భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరుగనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి భేటీ కాబోతుంది.
గతంలో 3 సార్లు (పాట్నా, బెంగళూరు, ముంబై) సమావేశమైన ఇండియా కూటమి.. ఢిల్లీలోని అశోక హోటల్లో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగనుంది. ఇండియా కూటమి కీలక భేటీ అజెండాలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారమ్ ,ప్రణాళిక ప్రధానాంశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఉభయ సభల నుంచి 92 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ పై చర్చ కూడా జరుగనుంది.
కాగా, పార్లమెంట్ ఘటనపై ప్రధాని మోడీ, అమిత్ షా సమాధానం చెప్పాలని నిన్న విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ నుంచి ఒకేరోజు 78 సభ్యులను సస్పెన్షన్ వేశారు. ఇందులో 33 మంది లోక్సభ సభ్యులు, 45 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. గత శుక్రవారం 14 మంది సభ్యుల సస్పెన్షన్ అయ్యారు. దీంతో ఉభయ సభల నుంచి మొత్తం 92 మంది విపక్ష సభ్యులు సస్పెన్షన్ అయ్యారు.