Political Updates: తెలంగాణ గిరిజన వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Political Updates: A check on British laws..Lok Sabha approves some criminal bills
Political Updates: A check on British laws..Lok Sabha approves some criminal bills

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకుంది. తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం బిల్లుకు ఎట్టకేలకు కీలక అడుగు ముందుకు పడింది. ఈ బిల్లుకు గురువారం రోజున లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ వర్సిటీ పేరును చేరుస్తూ కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ చట్టం బిల్లుపై 2 రోజులు చర్చలు జరిపారు. అనంతరం సభ మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గిరిజనుల అభ్యున్నతికి ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఇందులో భాగంగానే సమ్మక్క సారక్క వర్సిటీ నెలకొల్పుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది తరలివచ్చే సమ్మక్క సారక్క మహాజాతర జరిగే ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడంలో జాప్యం చేయడం వల్లే ఇది ఆలస్యమైందని ఆయన సభకు వివరించారు. దీన్ని దాదాపు రూ.900 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.