తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇవాళ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయ్యారు. పీఏసీ చైర్మన్ మాణిక్ రావు ఠాక్రె అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఏసీ సభ్యులు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ కాబట్టి.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని పీఏసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మాణం చేసి పంపించాం.
ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలని చర్చించాం. వాటి అమలు గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు వివరిస్తారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అప్పుల వివరాలను అసెంబ్లీలో పొందుపరుస్తారు. అదేవిధంగా ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయి. గ్రామసభలు నిర్వహించి అర్హులైన మహిళలకు రూ.2500 కేటాయించనున్నట్టు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ సన్నద్ధం చేసే అశంపై కూడా చర్చించామని తెలిపారు షబ్బీర్ అలీ.