దానిమ్మ తొక్క పవర్ ముందు ఫ్రిజ్ బలాదూర్…

Pomegranate-storage-better-

మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టినట్టు ఫ్రిజ్ కి, దానిమ్మతొక్క కు సంబంధం ఏంటా అని బుర్ర బద్దలు కొట్టుకోనవసరంలేదు.మాంసం నిల్వ కోసం తక్కువ ఖర్చుతో వున్న మార్గాలపై డీఆర్డీఓ పరిశోధన చేసింది. సరిహద్దుల్లో వున్న సైనికులకు సురక్షిత ఆహార పంపిణీ కోసం ఆ సంస్థ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది .

ఈ పరిశోధనలో వారికి దానిమ్మ తొక్క ఔషధ గుణాలు తెలిసొచ్చాయి .తొక్క నుంచి సేకరించిన ఓ పదార్ధాన్ని మాంసం కి ఇంజెక్ట్ చేస్తే చాలు …అది వారం పాటు చెడిపోదు.ఫ్రిజ్ లో మాంసాన్ని అన్నేసి రోజులు నిల్వ చేయలేముగదా… దానిమ్మ తొక్కలో వుండే యాంటీ ఆక్సిడెంట్ శక్తి మాంసం పాడుగాకుండా చూస్తుంది . పైగా మాంసం రుచి ,నాణ్యతలో ఏ మాత్రం తేడా రాదు. ఇప్పుడు చెప్పండి ఫ్రిజ్ కన్నా దానిమ్మ తొక్క బెటరా …కాదా